వరంగల్​ వైద్య విద్యార్థిని ప్రీతి తీసుకున్న ఇంజక్షన్ ఏంటి?

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తండ్రి నరేందర్ వాదిస్తుండగా, ప్రీతి సక్సీ నైల్ కోలిన్ అనే మత్తు ఇంజక్షన్ వేసుకోవడం వల్లనే ప్రాణాలు కోల్పోయిందని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. దీనిపై వాదోపవాదాలు ఎలా ఉన్నా ఆ సక్సీ నైల్ కోలిన్ అనేది జనరల్ అనస్తీషియా అని, అది వేసుకున్నాక ఐదు నిమిషాల లోపు కృత్రిమ శ్వాస అందించకపోతే రోగి ప్రాణాలు కోల్పోతాడని అనస్తీసియా వైద్యులు చెబుతున్నారు.

ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం ఒక రోగి శస్త్ర చికిత్స చేసేటప్పుడు రెండు రకాలుగా అనస్థీషియా వాడతారు. ఒకటి లోకల్, మరొకటి జనరల్. లోకల్ అనస్తీసియా నడుము భాగంలో ఇస్తారు. దీనివల్ల కండరం అనేది సడలిపోతుంది.. ఫలితంగా శస్త్ర చికిత్స చేసేందుకు వైద్యులకు రోగి శరీరం సహకరిస్తుంది.. ఇలాంటి లోకల్ అనస్తీషియా కుటుంబ నియంత్రణ, ప్రసవం, హెర్నియా, పలు రకాలైన వ్రణాల తొలగింపుకు వాడుతారు. దీనివల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. అలాగని చెప్పి మోతాదుకు మించితే ప్రాణాపాయం తప్పదు.
ఇక జనరల్ అనస్తీషియా క్రిటికల్ ఆపరేషన్లకు వాడతారు. రోగికి చేసే శస్త్ర చికిత్స ఆధారంగా దీనిని వాడుతారు.. డ్రగ్ అనేది 2 ఎం ఎం నుంచి గరిష్టంగా 2.5 ఎంఎం వరకు ఉపయోగిస్తారు.. ఇది వేసిన ఐదు నిమిషాల లోపే రోగి శరీరానికి కృత్రిమ శ్వాస అందిస్తారు.. కృత్రిమ శ్వాస అందని పక్షంలో రోగి శరీరంలోని శ్వాస కోశ వ్యవస్థ విఫలమవుతుంది. కొంత సమయానికి మెదడులో అంతర్గత రక్తస్రావం ఏర్పడుతుంది. ఇది గుండె పనితీరుపై ప్రభావం చూపి రోగి మరణించేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాదు జనరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు రోగి రక్త పీడనం, శ్వాస రేటు ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తారు.. రోగి శరీరంలో ఏ మాత్రం మార్పు వచ్చినా వెంటనే దానికి అనుగుణంగా వైద్యం అందిస్తారు.. అందుకే అనస్తీషియా ఇచ్చేటప్పుడు వైద్యులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
ప్రీతి విషయంలో..
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రీతి ఎక్కువ డోస్ ఆనస్తీషియా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆమె స్నేహితులు చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె వేసుకున్న సక్సీ నైల్ కోలిన్ అనే మత్తు ఇంజక్షన్ చాలా డేంజర్. పైగా ఈ ఇంజక్షన్ ను ప్రీతి తన ప్రైవేట్ పార్ట్స్( థైస్, కండరాలు ఉన్న ప్రాంతం) లో వేసుకోవడం వల్ల ఇంజక్షన్ మరింత ఎఫెక్ట్ గా పనిచేసింది.. ఆమె ఇంజక్షన్ వేసుకున్న సమయానికి ఐదు నిమిషాల లోపు కృత్రిమ శ్వాస అందిస్తే పెద్దగా ప్రాణాపాయం ఉండేది కాదు. గోల్డెన్ అవర్స్ ( రోగికి చికిత్స అందించే అత్యవసర సమయం) లో సత్వర చికిత్స అందకపోవడంతో ఆమె అచేతనంగా పడిపోయింది.. అయితే ఈ డ్రగ్ వల్ల ఆమె శ్వాస వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. తర్వాత అది మెదడులో అంతర్గత రక్తస్రావానికి కారణమైంది. అంతేకాకుండా ఆమె మూత్రపిండాలు కూడా దెబ్బతిన్నాయి. వీటి ప్రభావం గుండె మీద తీవ్రంగా పడింది. దీంతో దేహంలోని అన్ని అవయవాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఫలితంగా ఆమె మరణించింది. నిమ్స్ లో ప్రీతి మృతదేహానికి ఆదివారం రాత్రి పోస్టుమార్టం నిర్వహించారు. కానీ దీనికి సంబంధించి వివరాలు బయటకు రాలేదు. కానీ.. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం సక్సీ నైల్ కోలిన్ మత్తుమందును ఎక్కువ మోతాదులో ప్రీతి తీసుకున్నట్టు తెలుస్తోంది. పైగా సైఫ్ తనను ఏదో చేస్తాడని భయంతో, తాను ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *