అక్షయ్ కుమార్ క్షమాపణ.. పౌరసత్వం వదులుకున్న స్టార్‌ హీరో!

బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో అక్షయ్‌ కుమార్‌ ఒకరు.  సినిమా జయాపజయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ సత్తా చాటుతున్నాడు అక్షయ్.  ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలు చేస్తూ తన హవా చాటుతుంతాడు. గతేడాది అంటే 2022 సంవత్సరంలో ఏకంగా 5 చిత్రాలు విడుదల చేసి తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న అక్కీ మూడు నిమిషాల్లో 184 సెల్ఫీ ఫొటోలు దిగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హీరోగా ఘనత సాధించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో హిట్‌ కోసం ఎదరుచూస్తున్న అక్షయ్​, తాజాగా ‘సెల్ఫీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశలతో విడుదలైన ఈ చిత్రం అక్షయ్‌ అభిమానులకు నిరాశను మిగిల్చింది. అయితే, ఈ సినిమా నిరాశపర్చిన తర్వాత అక్షయ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

‘సెల్ఫీ’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్‌ కుమార్‌ తన సినిమాల ఫ్లాప్‌లపై మాట్లాడుతూ..‘నేను సినిమాల విషయంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. ఒక సమయంలో నేను నటించిన 16 సినిమాలు వరసగా నిరాశపర్చాయి. మరోసారి ఎనిమిది సినిమాలు ఆశించిన మేరకు ఆడలేదు. సినిమా హిట్‌ అవ్వడంలేదంటే అది నా తప్పే. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం లేదంటే వాళ్లు నా నుంచి కొత్తదనం నిండిన కథలను ఆశిస్తున్నారని అర్థం చేసుకోవాలి. నేను ప్రస్తుతం దాని కోసమే ప్రయత్నిస్తున్నాను. ఇది కేవలం సినీ పరిశ్రమలోని వారికే కాదు అందరికీ వర్తిస్తుంది. ఒక వ్యాపారంలో ఎప్పుడూ లాభాలే రాకపోవచ్చు. ఒక క్రికెటర్‌ ప్రతి ఇన్నింగ్స్‌లో శతకం సాధించలేడు. నేను చెప్పేది ఒక్కటే.. సినిమా హిట్‌ అవ్వకపోతే ప్రేక్షకులను నిందించవద్దు. అది వంద శాతం నా తప్పే’ అన్నాడు.

రాజ్‌ మెహతా దర్శకత్వంలో అక్షయ్‌కుమార్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సెల్ఫీ’. మలయాళ హిట్‌ చిత్రం ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’కు రీమేగా ఈ చిత్రం తెరకెక్కింది.  డ్రైవింగ్‌ లైసెన్స్‌ నేపథ్యంలో ఓ హీరో, ఓ మోటార్‌ సైకిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మధ్య జరిగే కథతో ఈ చిత్రం సాగుతుంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంతో విఫలమైంది.

కెనడా పౌరసత్వం వదులుకుని..

అక్షయ్​పై చాలా రోజులుగా కెనడా పౌరసత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో తాజాగా మాట్లాడుతూ ఆయన అసలు ఎందుకు కెనడా పౌరసత్వం ఎదుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. అసలు విషయాలు తెలియకుండా తనను అలా బాధపెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇండియానే నాకు సర్వస్వం. నేను ఏం సంపాదించినా.. సాధించినా అన్నీ ఇక్కడి నుంచే. నేను పొందిన దాని నుంచి తిరిగి చెల్లించే సౌభాగ్యం కూడా నాకు దక్కింది. కానీ ఏం తెలియకుండా కొందరు మాట్లాడే మాటలు చాలా బాధిస్తాయి’ అని తెలిపిన అక్షయ్ కుమార్ తను కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *